వాయుగుండం ఎఫెక్ట్.. విశాఖ తీరానికి భారీ నౌక - MicTv.in - Telugu News
mictv telugu

వాయుగుండం ఎఫెక్ట్.. విశాఖ తీరానికి భారీ నౌక

October 13, 2020

Navy Ship

బంగాళాఖాతంలో వాయుగుండం పెను ప్రభావాన్ని చూపుతోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో భారీ వస్తువులు కొట్టుకొని వస్తున్నాయి. తాజాగా విశాఖ తీరానికి ఓ పెద్ద నౌక కొట్టుకొని వచ్చింది. తెన్నేటి పార్క్ సమీపంలోకి ఇది రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. బంగ్లాదేశ్‌కు చెందిన మర్చంట్‌ వెసల్‌ నౌకగా గుర్తించారు. వెంటనే అధికారులు అక్కడకు చేరుకొని అందులో ఉన్న సిబ్బందిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

80 మీటర్ల పొడవాటి నౌక వచ్చి ఇసుక తిన్నుల మధ్య చిక్కుకుంది. గాలితీవ్రత ఎక్కవగా ఉండటంతో ప్రతికూల వాతావరణం కారణంగా అది దిశ మార్చుకొని ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. దీంతో నౌకకు ఉన్న రెండు యాంకర్లు  ధ్వంసం  అయ్యాయి. ఈ సమస్య కారణంగానే కొట్టుకుపోయిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆ దేశ నేవి అధికారులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో షిప్‌లో 15మంది సిబ్బంది ఉన్నారు. అయితే ఎవరికి ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరాన్ని తాకడంతో గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.