భారత ఆటగాళ్లపై బంగ్లా ఆటగాళ్ల దురుసు ప్రవర్తన..  - MicTv.in - Telugu News
mictv telugu

 భారత ఆటగాళ్లపై బంగ్లా ఆటగాళ్ల దురుసు ప్రవర్తన.. 

February 10, 2020

dfg

విజయం ఎవరికైనా వివేకం నేర్పాలి. కానీ దాన్ని మరిచిన బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాళ్లు అతిగా ప్రవర్తించారు. దీంతో క్రికెట్ అభిమానులతో చివాట్లు తినాల్సి వచ్చింది. అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్‌లో విజయం సాధించిన తర్వాత వారు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. భారత ఆటగాళ్లను నెట్టివేస్తూ విజయోత్సాహంలో మునిగిపోవడంతో గ్రౌండ్‌లోనే చిన్నపాటి వివాదం తలెత్తింది. కానీ భారత్ కోచ్ సమయస్పూర్తితో అంతా ప్రశాంతంగా ముగిసింది. 

అండర్ 19 ప్రపంచ కప్ చాలా ఆసక్తిగా సాగింది. విక్టరీ కోసం భారత్,బంగ్లాదేశ్ యువ ఆటగాళ్లు పోటీ పడ్డారు.  కానీ చివరి నిమిషంలో బంగ్లాను విజయం వరించింది. దీంతో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనందంలో బంగ్లాదేశ్‌ క్రికెటర్లు రెచ్చిపోయారు. మైదానంలోకి ఆటగాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చి భారత ప్లేయర్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. వారిపైకి దూసుకెళ్తూ గేలి చేశారు. ఓ భారత క్రికెటర్‌ అతడిని నెట్టివేయడంతో అంపైర్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీంతో డగౌట్‌ నుంచి భారత కోచ్‌ పారస్‌ మాంబ్రే అందరినీ రమ్మని సైగ చేశాడు. అక్కడితో వివాదం సద్దుమణిగింది. ఈ వీడియో చూసిన వారంతా ఆటగాళ్ల తీరును తప్పుబడుతున్నారు. కాగా మ్యాచ్ ప్రారంభానికి ముందు పేసర్‌ షోరిఫుల్‌ ఓపెనర్లపై స్లెడ్జింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే.