భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ బౌలర్లు రాణించడంతో స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. 73.5 ఓవర్లలో 227 పరుగులు మాత్రమే జోడించింది. బంగ్లాను అశ్విన్, ఉమేష్ యాదవ్ దెబ్బకొట్టారు. చెరో నాలుగు వికెట్లు తీసి రాణించారు. 12 ఏళ్ల తర్వాత టెస్టు ఆడుతున్న జయ్‌దేవ్ ఉనద్క త్‌కి రెండు వికెట్లు దక్కాయి. కీలకమైన జకిర్, ముష్ఫికర్ వికెట్లు పడగొట్టాడు. బంగ్లా బ్యాటింగ్‌లో ఎమ్.హక్ (84 పరుగులు) మాత్రమే రాణించాడు. ముష్ఫీకర్ రహీమ్ 26, లిటన్ దాస్ 25, షాంటో 24 పరుగులు చేశారు. టీ బ్రేక్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 184 రన్స్ చేసిన బంగ్లా వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. కేవలం 14 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చివరి ఐదు వికెట్లు చేజార్చుకుంది. అనంతరం టీం ఇండియా తన బ్యాటింగ్‌ను ప్రారంభించింది.