HYD ప్రియుడితో కలిసి మరో ప్రియుడిని తోసేసింది.. సీరియల్ నటి వికృతం - MicTv.in - Telugu News
mictv telugu

HYD ప్రియుడితో కలిసి మరో ప్రియుడిని తోసేసింది.. సీరియల్ నటి వికృతం

November 1, 2022

సీరియల్‌ను తలపించే ట్విస్టులున్న ఘటన ఇది. సీరియల్‌లో నటించే ఓ నటి ముందు ఓ వ్యక్తితో సహజీవనం చేసింది. అతనితో కలిసి నాలుగేళ్లు ఒకే రూంలో నివసించింది. వీరి మధ్య మూడో వ్యక్తి ప్రవేశించడంతో మొదటి ప్రియుడిని నిర్లక్ష్యం చేసింది. తర్వాత రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడిని చంపడానికి ప్లాన్ వేసి విఫలమైంది. ప్రేయసి కుట్రలో చిక్కుకుని అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డ మొదటి ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ట్రయాంగిల్ ప్రేమ కథ హైదరాబాద్ నగరంలోని యూసుఫ్ గూడలో జరిగింది.

గుప్పెడంత మనసు, గుండమ్మ కథ వంటి సీరియళ్ళ ద్వారా పేరు తెచ్చుకున్న నాగవర్ధిని అనే యువతి ఓ అపార్ట్‌మెంటులో మరో నటుడు సూర్య అనే వ్యక్తితో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తోంది. అయితే నాలుగు నెలల క్రితం సూర్య స్నేహితుడు శ్రీను అదే రూంకి వచ్చి వారితో పాటు ఉంటున్నాడు. ఈ క్రమంలో శ్రీను, నాగవర్ధినిల మధ్య స్నేహం పెరిగి అఫైర్‌కు దారి తీసింది. ఇది తెలిసిన సూర్య.. ఇద్దరినీ మందలించగా, అప్పటి నుంచి ముగ్గురి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వారితో కలిసి ఉండలేనని భావించిన సూర్య.. అదే బిల్డింగులోని నాలుగో అంతస్తుకు మారాడు. రెండో అంతస్తులో శ్రీను, నాగవర్ధిని కలిసి ఉంటున్నారు. అయినప్పటికీ నాగవర్ధిని విషయంలో సూర్య, శ్రీనుల మధ్య గొడవలు జరిగాయి. నాగవర్ధిని శ్రీనును సమర్ధించడంతో తట్టుకోలేని సూర్య.. రెండో అంతస్తుకు వచ్చి వారితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో శ్రీను, నాగవర్ధినిలు సూర్య అడ్డు తొలగించాలనుకొని రెండో అంతస్తు నుంచి సూర్యను కిందకు తోసేశారు. కింద పడి తీవ్ర గాయాలపాలైన సూర్య ఆస్పత్రిలో చికిత్స తీసుకొని బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులిద్దరినీ రిమాండుకు తరలించారు.