Banjara hills traffic si Ramana tragedy end
mictv telugu

బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ ఆత్మహత్య.. నుజ్జునుజ్జు

October 27, 2022

ధైర్యసాహసాలతో విధులు నిర్వహించిన యువకుడు ఓ సమస్యలోంచి బయటపడలేక ప్రాణం తీసుకున్నాడు. హైదరాబాద్ నడిబొడ్డు బంజారాహిల్స్‌లో ట్రాఫిక్‌ ఎస్సైగా పనిచేస్తున్న రమణ గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాజిగిరిలోని మౌలాలి రైల్వే స్టేషన్ దగ్గర పట్టాలపై తల పెట్టి చనిపోయాడు. శరీరం నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న అక్కడ దొరికిన ఆధారాలను బట్టి మృతుణ్ని గుర్తించారు. 2020 ఎస్సై బ్యాచ్‌కు చెందిన రమణ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో స్పష్టంగ తెలియడం లేదు. అయితే ప్రేమవైఫల్యాన్ని తట్టుకోలేకే చనిపోయి ఉండొచ్చని వార్తలు వస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఉద్యోగంలో చేరి రెండేళ్లు కూడా పూర్తికాకముందే చనిపోవడంతో రమణ ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.