వైసీపీ నేత పీవీపీ కోసం గాలిస్తున్న పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీ నేత పీవీపీ కోసం గాలిస్తున్న పోలీసులు

July 5, 2020

PVP

పారిశ్రామికవేత్త, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) కోసం బంజారాహిల్స్‌ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ విల్లా విక్రయం నేపథ్యంలో వివాదం చెలరేగింది. వాచ్‌మెన్‌ను కిడ్నాప్‌ చేసిన కేసులో హైదరాబాద్‌ నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఆయనను పట్టుకోవడానికి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆయనపై బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో పలు కేసులు నమోదై ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో బెజవాడలో పోలీసులు విచారించారు. ఆయన అనుచరులు, ఉద్యోగులను విచారిస్తున్నారు. 

కాగా, ఓ విల్లా విక్రయంలో తలెత్తిన వివాదం కాస్తా పెద్దదైంది. ఈ క్రమంలో వాచ్‌మెన్‌ను పీవీపీ కిడ్నాప్‌ చేశారన్నది ఆయనపై ప్రధాన అభియోగం ఉంది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయడానికి ఇంటికి వెళ్లిన పోలీసుల పైకి పీవీపీ తన పెంపుడు కుక్కలను ఉసిగొలిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన పరారయ్యారు. ఈ నెల 1న విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో నూతన అంబులెన్స్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నారు. ప్రసార మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు విజయవాడలో ఆయన ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.