కడుపునొప్పికి క్యాష్ మందు.. 22 లక్షలతో బ్యాంక్ ఉద్యోగి పరార్ - MicTv.in - Telugu News
mictv telugu

కడుపునొప్పికి క్యాష్ మందు.. 22 లక్షలతో బ్యాంక్ ఉద్యోగి పరార్

May 11, 2022

కడుపునొప్పి పేరుతో బ్యాంక్‌లోని నగదుతో ఉడాయించాడు ఓ బ్యాంక్ ఉద్యోగి. ఈ సంఘటన మంగళవారం హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగింది. సాహెబ్‌నగర్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్.. నిన్న మధ్యాహ్నం కడుపునొప్పి టాబ్లెట్ తెచ్చుకుంటానంటూ చీఫ్ మేనేజర్ వద్ద పర్మిషన్ తీసుకొని, బ్యాంకులోని రూ.22 లక్షల నగదుతో పరారయ్యాడు. విషయం తెలిసిన చీఫ్ మేనేజర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ప్రవీణ్‌ నిన్నటి నుంచి కుటుంబసభ్యులకు కూడా అందుబాటులో లేడు. బ్యాంక్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్యాషియర్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.