బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరన్.. 26, 27న - MicTv.in - Telugu News
mictv telugu

బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరన్.. 26, 27న

September 13, 2019

బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు సిద్దమయ్యారు. ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ నాలుగు బ్యాంక్ ఆఫీసర్స్ ట్రేడ్ యూనియన్ సమ్మెకు పిలుపునిచ్చింది. రెండు రోజులపాటు దీన్ని కొనసాగించనున్నారు.ఈ ప్రతిపాదనలను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు యూనియన్ అందజేసింది. ఈ సమ్మెలో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ),ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్‌బీఓసీ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (ఎన్‌ఓబీఓ) పాల్గొననున్నాయి. 

ఇటీవల కేంద్రం 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ 4 సంస్థలుగానే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న బ్యాంకు ఉద్యోగుల యూనియన్ సెప్టెంబర్ 26 నుంచి  27 అర్ధరాత్రి వరకు నిరంతర సమ్మెకు పిలుపునిచ్చింది. అయినప్పటికీ కేంద్రం తన నిర్ణయాన్ని విరమించుకోకపోతే నవంబర్ రెండవ వారం నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించారు. రెండు రోజులపాటు ఉద్యోగులు సమ్మె చేస్తుండటంతో నాలుగు రోజులు బ్యాంకులు మూసుకోనున్నాయి. 28,29 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉండటంతో మొత్తం నాలుగు రోజులపాటు బ్యాంకు సేవలు నిలచిపోనున్నాయి.