వారంలో ఐదు రోజుల పనిదినాలు డిమాండ్‌పై ఐబీఏ(Indian Banks’ Association) సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో బ్యాంకులు వారానికి ఐదు రోజులే పని చేసే అవకాశం ఉంది. ఇది ఉద్యోగస్తులకు శుభవార్తగా చెప్పవచ్చు. అయితే ఖాతాదారులు మాత్రం ఈ నిర్ణయంతో ఇబ్బంది పడే అవకాశం ఉంది.
ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు నాలుగు ఆదివారాలతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం సెలవలు తీసుకుంటున్నారు. అయితే ఈ నిబంధనను మార్చాలని వారానికి ఐదు రోజులే పని దినాలు కల్పించాలని ఐబీఏ (ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్)కు బ్యాంకు ఉద్యోగుల సంఘం (యూఎఫ్‌బీఈ) ప్రతిపాదించింది. దీనిపై ఇరువురి మధ్య చర్చలు సఫలమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదనలకు ఐఓబీ ఓకే చెప్పేసినా ఆర్బీఐ కూడా దీనికి అంగీకరించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఈ నిబంధనలు అమల్లోకి వస్తే బ్యాంకు వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. అయితే ఐదు రోజులు 50 నిమిషాలు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. ఉదయం 09.45 గంటలకు బ్యాంకులు ప్రారంభమై, సాయత్రం 05.30 నిమిషాలకు మూసేయాల్సి ఉంటుంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.