పండగలు, పర్వదినాలు లేకపోవడంతో జూన్, జులై మాసాల్లో పెద్దగా సెలవులు రాలేదు. వీకెండ్లో వచ్చే సెలవులు తప్ప ఇతర హాలీడేస్ ఏమీ రాలేదు. అయితే ఆగస్టు నుంచి ఫెస్టివల్ సీజన్ మొదలుకానుంది. మొహర్రం, రాఖీపౌర్ణమి, కృష్ణాష్టమి, వినాయకచవితి ఆగస్టులోనే వచ్చాయి. దీంతో బ్యాంకులకు సెలవులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఆగస్టులో బ్యాంకులకు మొత్తం 10 సెలవులు వచ్చాయి. ఇందులో వీకెండ్లో వచ్చే సెలవులు కూడా ఉన్నాయి.
ఆగస్ట్ 9న మొహర్రం సందర్భంగా సెలవు ఉంది. ఆగస్ట్ 12న రాఖీ పౌర్ణమి ఉన్నా హైదరాబాద్ సర్కిల్లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు లేదు. ఇక ఇతర రాష్ట్రాల్లో ఆగస్ట్ 18, 19న కృష్ణాష్టమి సెలవులు ఉన్నాయి. కానీ హైదరాబాద్ సర్కిల్లో కృష్ణాష్టమి సెలవు ఆగస్ట్ 20న వచ్చింది. మొత్తం కలిపి ఆగస్టులో బ్యాంకులకు 10 సెలవులు వచ్చాయి. ఆగస్ట్ 31న వినాయక చవితి సందర్భంగా సెలవు.
ఆగస్టులో ఓ లాంగ్ వీకెండ్ కూడా ఉంది. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే కూడా సోమవారం వచ్చింది. అంతకన్నా ముందు రెండో శనివారం, ఆదివారం సెలవులు ఉన్నాయి. శుక్రవారం రాఖీ పౌర్ణమి ఉన్నా సెలవు లేదు. శుక్రవారం సెలవు పెట్టుకుంటే వరుసగా నాలుగు రోజులు లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు.