బ్యాంకులకు 5 రోజుల సెలవులుల్లేవు.. శనివారం పనిచేస్తాయి.. - MicTv.in - Telugu News
mictv telugu

బ్యాంకులకు 5 రోజుల సెలవులుల్లేవు.. శనివారం పనిచేస్తాయి..

March 26, 2018

ముందుగానే నెలాఖరు. ఆర్థిక సంవత్సరం ముగింపు రోజులు. డబ్బులకు కటకట. బ్యాంకుల్లో కిటకిట. దీనికి తోడు బ్యాంకులు 29వ తేదీ నుంచి వచ్చేనెల 2వరకు వరసగా 5 రోజులు పనిచేయవని సోషల్ మీడియాలో ఒకటే వార్తలు. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఇది నిజం కాదని, బ్యాంకులకు వరుస సెలవుల్లేవని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి థామస్ ఫ్రాంకో రాజేంద్ర దేవ్ తెలిపారు. బ్యాంకులు శనివారం పనిచేస్తాయన్నారు. ఆర్థిక సంవత్సరం చివరిరోజైనా ఆ రోజు విధులు నిర్వహిస్తామని తెలిపారు.

29 మహావీర్ జయంతి, 30 గుడ్ ఫ్రైడే, 31 ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు, 1వ తేదీ ఆదివారం, 2వ తేదీ యాన్యువల్ క్లోజంగ్ ఉన్నాయి. దీంత వరుసగా ఐదు రోజులు బ్యాంకులు పనిచేయడమని,  దీన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాంకు లావాదేవీలను త్వరగా పూర్తి చేసుకోవాలని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకోవాలని అంటున్నారు.