Bank Holidays February 2023 : వచ్చే నెలలో బ్యాంకులకు పదిరోజులు సెలవులు..!!
మరికొన్ని రోజుల్లో జనవరి నెల ముగుస్తుంది. రెండవ నెల ఫిబ్రవరి ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి నెలల కొన్ని రోజులు సెలవులు ఉంటాయి. ఆర్బీఐ విడుదల చేసే సెలవుల జాబిత ప్రకారం..ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు మొత్తం పది రోజులు సెలవులు ఉన్నాయి. ఇప్పుడు ఆర్బిఐ సెలవు జాబితాలోని అన్ని సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. అయా ప్రాంతీయ వేడకలు, పండగల ప్రకారం సెలవులు ఇవ్వబడతాయి. అయితే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు పబ్లిక్, గెజిటెడ్ సెలవులు వర్తిస్తాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు అన్ని ఆదివారాలు, రెండువ, నాలుగవ శనివారాలు సెలువులు ఉంటాయి. ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు వెళ్లాలనుకుంటే ఆర్బిఐ సెలవు జాబితాను ఓ సారి చెక్ చేయండి. లేదంటే బ్యాంకు రోజుల్లో బ్యాంకుకు వెళ్లండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు.
ఆర్బిఐ సెలవు జాబితాలోని సెలవులు ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ, విదేశీ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులకు వర్తిస్తాయి. బ్యాంకు సెలవుల్లో ఆన్‌లైన్ లావాదేవీలు, ఏటీఏం లావాదేవీలు ప్రభావితం కావు. ఏదైనా పని ఉంటే మాత్రం బ్యాంకుకు వెళ్లడం వాయిదా వేసుకోండి. కొన్నిసార్లు, మీరు ఇల్లు లేదా భూమి, కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే, బ్యాంకు లోన్ కోసం వెళ్తుంటారు. అలాగే బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేయాలన్నా, ఇతర ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్టుల్లో మదుపు చేయాలన్నా ప్లాన్ చేసుకున్నా బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి బ్యాంకులకు ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో ముందుగానే గమనించి..ఎప్పుడు బ్యాంకుకు వెళ్లాలో నిర్ణయించుకోండి.
ఫిబ్రవరి నెల సెలవుల జాబితా ఇక్కడ ఉంది:
ఫిబ్రవరి 5: ఆదివారం
ఫిబ్రవరి 11: రెండవ శనివారం
ఫిబ్రవరి 12: ఆదివారం
ఫిబ్రవరి 15: లుయి నాగై ని (మణిపూర్)
ఫిబ్రవరి 18: మహాశివరాత్రి (అహ్మదాబాద్, బెల్పూర్, బెంగళూరు, హైదరాబాద్, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, రాయ్‌పూర్ , రాంచీ, సిమ్లా, తిరువనంతపురంలో బ్యాంక్ సెలవు)
ఫిబ్రవరి 19: ఆదివారం
ఫిబ్రవరి 20: అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం
ఫిబ్రవరి 21: లోసార్ (సిక్కిం)
ఫిబ్రవరి 25: నాల్గవ శనివారం
ఫిబ్రవరి 26: ఆదివారం
ఇవి కూడా చదవండి :
ఏసీ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ డీల్.. స్ప్లిట్ ఏసీపై భారీ డిస్కౌంట్.!
క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా..?అయితే మీ జేబుకు చిల్లు ఖాయం..ఎందుకో తెలుసా..?