జులై నెలలో 8 రోజులు బ్యాంకులకు సెలవులు - MicTv.in - Telugu News
mictv telugu

జులై నెలలో 8 రోజులు బ్యాంకులకు సెలవులు

July 1, 2020

 nvgbvn

నగదు లావాదేవీలు, ఇతర విషయాల కోసం బ్యాంకులకు వెళ్లే పని ఉందా..? అయితే ముందుగా ఈ విషయాలను పక్కాగా గుర్తు పెట్టుకోవాల్సిందే. ఈ నెలలో దాదాపు 8 రోజులు బ్యాంకులు పని చేయవు. సాధారణ సెలవులతో పాటు రెండు పండగలు రావడంతో ఆయా రోజుల్లో బ్యాంకులు వేసి వేసి ఉంచనున్నారు. కాబట్టి ఖాతాదారులు ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. 

జులై నెలలో ఇంతకీ ఏఏ రోజులు సెలవులు అని అనుకుంటున్నారా..? అవి ఎప్పుడు ఎందుకో చూద్దాం. సాధారణంగా బ్యాంకులకు ప్రతీ ఆదివారంతో పాటు రెండు, నాలుగో శనివారం నాడు సెలవులు తప్పనిసరి. కాబట్టి ఈ నెలలో 5, 12, 19, 26 తేదీలలో నాలుగు ఆదివారాలు ఉన్నాయి. వీటితో పాటు 11, 25వ తేదీలు రెండు, నాలుగో శనివారాలు వచ్చాయి. కాబట్టి ఈ ఆరు రోజులు ఎట్టి పరిస్థితిలోనూ బ్యాంకులు తెరిచి ఉండవు. ఇక మిగిలిన రెండు రోజులు ప్రత్యేక సెలవులు ఉన్నాయి. జులై 20న బోనాల పండగ ఉంది. ఆ రోజు తెలంగాణ వరకు ఆర్బీఐ అధికారులు సెలవు ప్రకటించారు. ఇక 31వ తేదీ బక్రీద్ పండగ ఉండటంతో ఆ రోజు కూడా సెలవు ఇచ్చారు. మొత్తం మీద జులై నెలలో 8 రోజులు బ్యాంకులు పని చేయవన్న మాట. వీటిని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు పనులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.