కస్టమర్లకు అలర్ట్.. వచ్చే నెలలో బ్యాంకులు ఈ రోజుల్లో పనిచేయవు - MicTv.in - Telugu News
mictv telugu

కస్టమర్లకు అలర్ట్.. వచ్చే నెలలో బ్యాంకులు ఈ రోజుల్లో పనిచేయవు

May 31, 2022

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. వచ్చే నెల జూన్‌లో మీరు ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ప్లాన్ చేస్తున్నారా? లేదా బ్యాంక్‌కు వెళ్లే అవసరం ఉందా.? అయితే ఈ ముఖ్యమైన వార్త మీకోసమే. బ్యాంకు లావాదేవీలు ప్లాన్ చేసేప్పుడు బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకునేందుకు క్యాలెండర్ తిరగేస్తూ ఉంటారు. పండుగలు, ఇతర సందర్భాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటే ఆ రోజుల్లో లావాదేవీలు ప్లాన్ చేసుకోకుండా జాగ్రత్తపడతారు. కానీ జూన్, జూలై నెలల విషయానికి వస్తే కస్టమర్లకు ఈ అవసరం లేదు. జూన్ నెలలో సాధారణ సెలవులు సంఖ్య 6. అందులో 4 ఆదివారాలు.. రెండో శనివారం, నాలుగో శనివారం ఉన్నాయి. దాదాపుగా దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ బ్యాంకులు ఈ 6 రోజులు మూసి ఉంటాయి. ఇక జూన్ 2వ తేదీన షిమ్లాలో మహారాణ ప్రతాప్ జయంతి సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అలాగే జూన్ 15న ఐజ్వాల్, భువనేశ్వర్, జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో వైఎంఏ డే, గురు హర్‌గోబింద్ పుట్టినరోజు, రాజ సంక్రాంతి సందర్భంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. కాగా, మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. వీకెండ్ హాలిడేస్ తప్పితే.. బ్యాంకులు ప్రతీ రోజూ పని చేస్తాయి.