బ్యాంకులకు 19 రోజులు సెలవులా? ఇదీ సంగతి! - MicTv.in - Telugu News
mictv telugu

బ్యాంకులకు 19 రోజులు సెలవులా? ఇదీ సంగతి!

February 29, 2020

Bank Holidays.

లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్లేవారికి మార్చిలో కష్టాలు తప్పేలా లేవు. గతంలో ఎన్నడూ లేని విధంగా సెలవులు వస్తున్నాయి. సాధారణ సెలవులు, సమ్మెలు, వివిధ రాష్ట్రాల్లో అన్ని కలిపి కస్టమర్లను చీకాకు పెట్టనున్నాయి. బ్యాంకులకు ఒక నెలలో వారం నుంచి 10 రోజుల సెలవులు గతంలోనూ వచ్చాయి. శనివారాలు, ఆదివారాలు, పండగలు, సమ్మెలు కలుపుకుంటే అదేం పెద్ద వింత కాదు. కానీ మార్చి నెలలో  ఏకంగా 19 రోజులు సెలవులు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. దీంతో కస్టమర్లు బెంబేలెత్తున్నారు. 

ఇదీ విషయం 

బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మార్చి 11 నుంచి 13 వరకు సమ్మె నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. వేతనాల పెంపు కోసం దీనికి సిద్ధమయ్యారు. దీనికి తోడు మార్చి 10 హోళీ, మార్చి 14 రెండో శనివారం, మార్చి 15 ఆదివారం కావడంతో ఆరు రోజులు సేవలు నిలిచిపోనున్నాయి. వీటితో పాటు నాలుగో శనివారం, ఆదివారాలు, ఉగాది పండగ ఇతర రాష్ట్రాల్లోని వివిధ సెలవులు కలుపుకొని మొత్తం 19 రోజులకు చేరింది. అయితే ఈ సెలవులు మాత్రం అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. ఆయా రాష్ట్రాల్లోని పండగల ఆధారంగా అక్కడి వరకే పరిమితం అవుతాయి. కేవలం సాధారణ సెలవులు, సమ్మె రోజుల్లో మాత్రమే ఒకేలా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఒడిశా, బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లో వచ్చే పండగ సెలవుల ప్రభావం ఉండదు. కనుక 19 రోజుల సెలవులే అని భయపడాల్సిన అవసరం ఉండదు. 

 

సెలవుల వివరాలు ఇలా : 

మార్చి 1 – ఆదివారం

మార్చి 5 – పంచాయతీ రాజ్ దినోత్సవం(ఒడిశా)

మార్చి 6 – చాప్చర్‌కుట్ పండగ(మిజోరం)

మార్చి 8 – ఆదివారం

మార్చి 9 – హజరత్ అలీ పండగ(ఉత్తరప్రదేశ్)

మార్చి 10 – డోల్ పూర్ణిమ(ఒడిశా, వెస్ట్ బెంగాల్, త్రిపుర), హోళీ

మార్చి 11- నుంచి 13 – బ్యాంకుల సమ్మె

మార్చి 14 – రెండో శనివారం

మార్చి 15 – ఆదివారం

మార్చి 22 – ఆదివారం

మార్చి 23 – షహీద్ భగత్ సింగ్ డే(హరియాణా)

మార్చి 25 – ఉగాది (కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, జమ్మూ కశ్మీర్)

మార్చి 26 – చేతీచంద్ యానివర్సరీ( గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్)

మార్చి 27 – సర్హుల్ పండగ( ఝార్ఖండ్)

మార్చి 28 – నాలుగో శనివారం

మార్చి 29 – ఆదివారం