అక్టోబర్ నెలలో బ్యాంకు సెలవులు ఇలా  - MicTv.in - Telugu News
mictv telugu

అక్టోబర్ నెలలో బ్యాంకు సెలవులు ఇలా 

October 1, 2020

Bank Holidays In October

ఆర్థిక లావాదేవీ బ్యాంకు సేవల చాలా ముఖ్యం. ప్రతి వ్యవస్థ వాటిపై ఆధారపడే పని చేస్తున్నాయి.  ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఉన్నప్పటికీ కొన్ని పనులకు బ్యాంకులకు వెళ్లక తప్పదు. ఇలా వెళ్లిన సమయంలో సెలవులు ఉంటే ఇబ్బంది పడాల్సివస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా బ్యాంకు సెలవులను చూసుకొని పనులు పూర్తి చేసుకుంటే మంచిది. మరీ ఈ నెలలో ఏఏ రోజుల్లో బ్యాంకులు పని చేయవు, ఎన్ని సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.

అక్టోబర్ నెలలో 8 రోజులు పని చేయవు. వీటిలో ఆదివారాలు, శనివారాలతో పాటు రెండు ప్రభుత్వ సెలవు దినాలు ఉన్నాయి. 10, 24 తేదీల్లో రెండో శనివారం, 4, 11, 18, 25 తేదీల్లో ఆదివారాలు ఉండటంతో సాధారణ సెలవులు ఉన్నాయి. ఇక అక్టోబర్ 2న గాంధీ జయంతి  అక్టోబర్ 30న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఆర్బీఐ సెలవులు నిర్ధారణ చేసింది. ఇదే నెలలో దసరా పండగ ఉన్నప్పటికీ ఆదివారం రోజు కావడంతో వాటితో పాటే కలిసిపోయింది.