బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. కరూర్ వైశ్యా బ్యాంక్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు చేయడానికి ఫిబ్రవరి 15, 2023 చివరి తేదీ.
మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్kvb.co.in చెక్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వీటన్నింటి గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
అర్హతలు
కరూర్ వైశ్యా బ్యాంక్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ప్రకారం..పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 35ఏళ్లు మించకూడదు.
ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు తమిళనాడులోని కరూర్ వైశ్య బ్యాంకులో పోస్టింగ్ ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు 25 జనవరి 2023 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 15. పూర్తి వివరాల కోసం కరూర్ వైశ్య బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.