ఈఎంఐ వాయిదా సూపర్..వడ్డీ బాదుడే! - MicTv.in - Telugu News
mictv telugu

ఈఎంఐ వాయిదా సూపర్..వడ్డీ బాదుడే!

April 1, 2020

Bank loan EMI moratorium: Terms, conditions and charges

కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెల్సిందే. దీంతో కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ కారణంగా ఆఫీసులు, పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఉద్యోగులకు జీతాలు అందేలా లేవు. ఈ పరిస్థితుల్లో రుణగ్రహీతలకు రిజర్వు బ్యాంకు ఉపశమనం కల్పించింది. లాక్ డౌన్ కాలంలో ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం సదుపాయం కల్పించాలని బ్యాంకులకు సూచించింది. దీంతో మారటోరియం అందిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రకటించాయి. తాజాగా ప్రైవేటు రంగ బ్యాంకులు మారటోరియంపై స్పందించాయి. ఈ మేరకు ప్రైవేట్ బ్యాంకులు రుణగ్రహీతలు ఎస్ఎంఎస్ లు, ఈ మెయిల్స్ పంపిస్తున్నాయి. మారటోరియం కావాలంటే తప్పనిసరిగా బ్యాంకుకు ఆ విషయాన్ని తెలియజేయాలని వాటిలో పేర్కొన్నయూయి. మారటోరియం అవసరం లేనివారు బ్యాంకులను సంప్రదించాల్సిన అవసరం లేదని తెలిపాయి. మారటోరియం కాలానికి వడ్డీ వసూల్ చేస్తామని బ్యాంకులు తెలిపాయి.

మారటోరియంపై ప్రైవేట్ బ్యాంకుల స్పందన

* ఈఎంఐపై మారటోరియం అవసరం లేనివారు తమను సంప్రదించాల్సిన అవసరం లేదని హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్ తన అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది.

* యాక్సిస్ మారటోరియం విధివిధానాలపై పనిచేస్తున్నామని పేర్కొంది. అందుబాటులోకి తీసుకురాగానే ఆ విషయాన్ని ఖాతాదారులకు తెలియజేస్తామని ప్రకటించింది.

* మారటోరియం కావాలనుకునేవాళ్లు ఈమెయిల్ చెయ్యాలని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఓ మెయిల్ ఐడీని అందుబాటులోకి తెచ్చింది. మారటోరియం కాలానికి వడ్డీని వసూలు చేస్తామని తెలిపింది. 

* ఐసీఐసీఐ బ్యాంకు రుణ గ్రహీతలు రెండు ఆప్షన్స్ తీసుకొచ్చింది. వేతన జీవులకు రుణాలపై ఆప్ట్-ఇన్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అలాగే వ్యాపారులకు ఆప్ట్-ఔట్ సదుపాయాన్ని కల్పించింది. లాక్ డౌన్ పరిస్థితుల్లో వారి వద్ద చెల్లించాల్సిన మొత్తం ఉండదన్న ఉద్దేశంతో ఈ ఆప్షన్స్ కల్పించింది. అయితే, కడతామని ముందుకొచ్చే రుణగ్రహీతలు మాత్రం బ్యాంకుకు తెలియజేయాలని సూచించింది.