రూ.3.95 కోట్ల షేర్లను దానం చేసిన: ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ - MicTv.in - Telugu News
mictv telugu

రూ.3.95 కోట్ల షేర్లను దానం చేసిన: ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ

February 22, 2022

03

ఓ బ్యాంకు ఎండీ తన ఇంటిలో పనిచేసే పనిమనిషికీ, కారును డ్రైవ్ చేసే డ్రైవర్‌కీ రూ. 3.95 కోట్లు విలువ చేసే 9 లక్షల షేర్లను పంచిపేట్టిన సంఘటన సంచలనం రేపుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ రూ. 3.95 కోట్ల విలువైన తన 9 లక్షల షేర్లను ట్రైనర్, ఇంటి పని మనిషి, కారు డ్రైవర్‌తో సహా ఐదుగురికి పంచిపెట్టేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఈ ఐదుగురితో ఆయనకు ఎలాంటి బంధుత్వం లేదు. అంతేకాకుండా తనతో ఎలాంటి సంబంధం లేని మరికొందరికి గతంలోనూ కొన్ని షేర్లను దానం చేశారు.

అయితే ఇందులో 3 లక్షల షేర్లను తన ట్రైనర్ రమేశ్ రాజుకు, ఇంటి పనిచేసే ప్రంజల్ నర్వేకర్, కారు డ్రైవర్ అల్గర్‌స్వామి సి మునపర్‌లకు చెరో 2 లక్షల షేర్లు, ఆఫీస్ సపోర్ట్ స్టాఫ్ అయిన దీపక్ పథారే, ఇంటి పనిమనిషి సంతోష్ జొగాలేకు చెరో లక్ష షేర్లను వైద్యనాథన్ బహుమానంగా ఇచ్చేశారు. నిన్నటి క్లోజింగ్ ధర ప్రకారం బీఎస్ఈలో ఐడీఎఫ్‌సీ షేర్ ఒక్కోటి రూ. 43.90గా ఉంది. ఈ లెక్కన వైద్యనాథన్ బహుమతిగా పంచిపెట్టిన 9 లక్షల షేర్ల విలువ రూ. 3,95,10,000. కాగా, రుక్మిణి సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్‌కు 2 లక్షల షేర్లను ఇచ్చినట్టు ఐడీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది. మొత్తంగా 11 లక్షల ఈక్విటీ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చినట్టు బ్యాంకు పేర్కొంది.