బయటపడ్డ 9 చెల్లని నోట్లు.. అదృష్టమంటే అదీ..
ఇప్పుడంటే బ్యాంకులు, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్లు, డిజిటల్ కరెన్సీ.. అని రకరకాలుగా డబ్బును దాచుకుంటున్నారు కానీ.. ఒకప్పుడు ఇలాంటి సౌకర్యాలేవీ లేవు. పాతకాలం లో సంపదనంతా భూమిలోనే పాతిపెట్టేవారు. అప్పుడప్పుడు గుప్తనిధుల గురించి వచ్చే వార్తలు.. అలా పాతిపెట్టినవే. ఆ సంపదను అడవులు, పర్వతాలలోనూ పాతిపెట్టేవారు.
అలా పాతిపెట్టిన కరెన్సీ బ్రిటన్ లో ఒక వృద్ధ జంటను లక్షాదికారుల్ని చేసింది. బ్రిటన్‌లోని బ్రిస్టల్‌లో ఇంటి మరమ్మతుల సమయంలో ఓ వృద్ధ దంపతులకు 100 సంవత్సరాలకు పైగా పురాతనమైన పాత నోట్లు వారికి లభించాయి. 1916, 1918 మధ్య ముద్రించిన 9 పాత నోట్లు కనిపించాయి. అవి పాతవి కావటంతో వాటికి మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. వీటిని వేలం వేయగా.. ఏకంగా రూ. 47 లక్షలు వచ్చాయి. ప్రస్తుతం వేలంలో వచ్చిన డబ్బుతో ఈ వృద్ధ దంపతులు తమ డైమండ్ జూబ్లీ వార్షికోత్సవాన్ని జరుపుకోవాలని ప్లాన్స్ వేస్తున్నారు.