Bank of baroda employee fraud crores transfer
mictv telugu

5 నెలల కిందటే బ్యాంక్ జాబ్.. 2.9 కోట్లు పంగనామం.. భార్యకు..

September 14, 2022

ప్రభుత్వ ఉద్యోగం కోసం కోట్ల మంది ప్రయత్నిస్తుంటే మరికొందరు ఎంతో కష్టపడి సాధించిన సర్కారీ ఉద్యాగాలు దురాశతో ఊడగొట్టుకుంటున్నారు. ఐదు నెలల కిందట అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ గా కొలువులో చేరిన ఓ ప్రబుద్ధుడు అత్యాశతో రూ. 2.69 కోట్లకు బ్యాంకుకు పంగనామం పెట్టేశాడు. ఆ డబ్బును దొంగచాటుగా భార్య ఖాతాకు మళ్లించాడు. బ్యాంకు సిబ్బంది ఐడీలు, పాస్ వర్డులు తెలుసుకుని చాకచక్యంగా దగా చేశాడు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర్లోని బరోడా బ్యాంకులో ఈ మోసం జరిగింది.

ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన ముప్పై మూడేళ్ల బోనాల కుమార్ ఐదు నెలల కిందట ఈ బ్యాంకులో చేరాడు. రోజూ కట్టల కట్టల డబ్బు చూసి కన్నుకుట్టిందో, లేకపోతే మరేవ్యవహారాలేమైనా ఉన్నాయేమోగాని విడదల వారీగా తన భార్య ప్రియాంక ఖాతాలోకి సెప్టెంబర్ 5 నాటికి రూ.2.69 కోట్లు పంపించాడు. తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. సెలవు కూడా పెట్టకుండా పోవడంతో ఏమైనా జరిగిందేమోనని ఫోన్ చేశారు. కుమార్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానమొచ్చి బ్యాంకు ఖాతాలను చెక్ చేయగా బండారం బయటపడింది. అతని ఖాతాలో ఒక్క రూపాయి కూడా కనిపించలేదు. పోలీసులు అతని గాలిస్తున్నారు.