బ్యాంకులో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. ఇంకెందుకు ఆలస్యం - MicTv.in - Telugu News
mictv telugu

బ్యాంకులో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. ఇంకెందుకు ఆలస్యం

March 17, 2019

చాలామందికి బ్యాంకుల్లో ఉద్యోగం చేయాలని కోరిక వుంటుంది. అందుకోసం వేల రూపాయలు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకుంటుంటారు. అలా కోచింగ్ తీసుకుని ఉద్యోగంలో చేరేందుకు ప్రయత్నిస్తున్నవారికి శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా మీకు ఆహ్వానం పలుకుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రొడక్ట్ మేనేజర్ పోస్టులకు నోటిఫీకేషన్ విడుదలైంది. ఎంబీఏ లేదా పీజీడీఎం చదివిన వారికి ఇది చాలమంచి అవకాశం. ప్రారంభ వేతనమే రూ.1 లక్ష ఉంటుంది. వార్షిక ప్యాకేజీ రూ.12,00,000. ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ www.bankofbaroda.co.in ఓపెన్ చేసి careers సెక్షన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 25 తేదీన దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.

బ్యాంకులో ఖాళీలు ఉన్న పోస్టులు..

ప్రొడక్ట్ మేనేజర్ : శాలరీ పోర్ట్‌ఫోలియో- 1

ప్రొడక్ట్ మేనేజర్ : మర్చెంట్ అక్విజిషన్ బిజినెస్- 1

ప్రొడక్ట్ మేనేజర్ : కరెంట్ అకౌంట్- 1

ప్రొడక్ట్ మేనేజర్ : సేవింగ్ అకౌంట్- 1

ప్రొడక్ట్ మేనేజర్ : డీమ్యాట్/ట్రేడింగ్ అకౌంట్- 1

ప్రొడక్ట్ మేనేజర్ : గవర్నమెంట్/పీఎస్‌యూ బిజినెస్- 1

కావాల్సిన అర్హతలు..

ఎంబీఏ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్, డిజిటల్ మార్కెటింగ్‌లో సర్టిఫికేషన్. వయస్సు 28 నుంచి 35 ఏళ్లు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగులు, మహిళలకు వయస్సులో సడలింపు)

 

ఫీజుల వివరాలు :  జనరల్, ఓబీసీ : 600.. ఎస్సీ, ఎస్టీ : రూ.100

ప్రొడక్ట్ మేనేజర్ వేతనం : ప్రొడక్ట్ మేనేజర్‌గా ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.12లక్షల నుంచి రూ.18 లక్షల జీతం ఉంటుంది.