నేడు బ్యాంకుల సమ్మె.. - MicTv.in - Telugu News
mictv telugu

నేడు బ్యాంకుల సమ్మె..

October 22, 2019

ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బ్యాంకు ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఒక్క రోజు సమ్మెకు దిగారు. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన 3.50 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. బ్యాంకుల విలీనం, బ్యాంకింగ్‌ సంస్కరణలు, వినియోగదారులకు విధిస్తున్న అధిక జరిమానాలు, సేవా ఛార్జిలను వ్యతిరేకించేందుకే సమ్మెకు పిలుపునిచ్చామని ఆయా సంఘాలు తెలిపాయి. 

Bank strike today.

దీంతో తమ బ్యాంకుల కార్యకలాపాలు ప్రభావితం అవుతాయని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, సిండికేట్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తదితర బ్యాంకులు పేర్కొన్నాయి. బ్యాంకుల విలీనం ద్వారా ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కి తగ్గనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు మాత్రం సమ్మెలో పాల్గొనడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎస్‌బీఐలో పాక్షికంగా సమ్మె ప్రభావం పడనుంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కార్పోరేషన్ బ్యాంకులు కూడా సమ్మెలో పాల్గొనడం లేదు.