Banks canceled 10 lakh crores in five years: Centre
mictv telugu

ఐదేళ్లలో బ్యాంకులు 10 లక్షల కోట్లు రద్దు చేశాయి : కేంద్రం

August 3, 2022

మొండి బకాయిల కింద బ్యాంకులు ఎంత సొమ్ము రద్దు చేశాయో కేంద్రం మంగళవారం పార్లమెంటుకు తెలిపింది. గత ఐదేళ్లలో రూ. 10 లక్షల కోట్లు రద్దు చేశాయని లిఖిత పూర్వక సమాధానమిచ్చింది. ఈ మేరకు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆర్ధిక శాఖ సహాయ మంత్రి భగత్ వెల్లడించారు. అయితే 2018 – 19 ఆర్ధిక సంవత్సరంలో మొండి బకాయలు రూ. 2,36,265 కోట్లుండగా, 2021 – 22 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1,57,096 కోట్లకు తగ్గినట్టు వివరించింది. దీనితో పాటు ఉద్దేశపూర్వత రుణ ఎగవేతదారుల సంఖ్య గత నాలుగేళ్లలో 10,306గా ఉందని భగత్ చెప్పారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం ఇందులో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ రూ. 7,110 కోట్లు, ఈరా ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్ రూ. 5,879 కోట్లు, కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ రూ. 4,107 కోట్లు ఉన్నట్టు పేర్కొంది.