Banks closed for 14 days in July
mictv telugu

జూలైలో 14 రోజులు బ్యాంకులు బంద్..కారణం ఇదే..

June 27, 2022

దేశవ్యాప్తంగా జూలై నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. తాజాగా జూలై -2022 సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. జాబితా ప్రకారం.. ”జూలై నెలలో మొత్తం 14 రోజులు బ్యాంకులకు సెలవులు. ఇవి మొత్తం ఒకేరోజు సెలవులు కావు. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించుకునే పండుగల ప్రకారం బ్యాంకులు మూతపడనున్నాయి. నెలలో రెండు శనివారాలు, ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. జూలైలో మొత్తం ఐదు ఆదివారాలు వస్తున్నాయి. రెండు శనివారాల వస్తున్నాయి. మొత్తం కలిపితే సాధారణ సెలవులు ఏడు వస్తున్నాయి. బక్రీద్‌తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో పండుగల కారణంగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో శని, ఆదివారాలు మినహా బ్యాంకులు పనిచేస్తాయి”.

బ్యాంకులు మూసి ఉండే తేదీలు ఇవే…

జూలై 3, 10, 17, 24, 31 తేదీల్లో ఆదివారం కావడంతో బ్యాంకులు తెరుచుకోవు. ఇక, జూలై 9న సెకండ్ శనివారం (అదేవిధంగా బక్రీద్), జూలై 23న నెలలో నాల్గవ శనివారం. జూలై 1న కాంగ్ (రథయాత్ర)/రథయాత్ర (భువనేశ్వర్-ఇంఫాల్‌లో బ్యాంక్ మూసివేస్తారు), జూలై 5న (మంగళవారం) గురు హరగోవింద్ సింగ్ జీ ప్రకాష్ దివాస్ (జమ్మూ, కాశ్మీర్ బ్యాంక్ మూసివేస్తారు). జూలై 7న ఖర్చి పూజ (అగర్తలాలో బ్యాంకులు మూసివేస్తారు). జూలై 11న ఈద్-ఉల్-అజా (జమ్మూ, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసివేస్తారు). జూలై 13న భాను జయంతి (గ్యాంగ్‌టక్ బ్యాంక్ మూసివేస్తారు). జూలై 14న బెన్ డియెంక్లామ్ (షిల్లాంగ్ బ్యాంక్ మూసివేస్తారు). జూలై 16న హరేలా (డెహ్రాడూన్ బ్యాంక్ మూసివేస్తారు)