కాళీమాత సిగరెట్ కాలుస్తున్నట్టుగా పోస్టర్ వదిలిన ఘటన ఇంకా చల్లారకముందే తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లో శివుడు సిగరెట్ వెలిగిస్తున్నట్టు ఉన్న ఓ ఫోటో దర్శనమిచ్చింది.
ఇదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో విచారించిన స్థానిక పోలీసులు బ్యానర్‌ను ఏర్పాటు చేసిన వ్యక్తులను హెచ్చరించి బ్యానర్‌ను తొలగించారు. ఇదిలా ఉండగా, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్న కాళీమాత పోస్టర్‌ను ట్విట్టర్ భారత్‌లో నిషేధించింది. అంతేకాక, కెనడాలో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనను నిలిపివేశారు.