నాలుగేళ్ల ఫేస్‌బుక్ ప్రేమ.. ట్రాన్స్‌జెండర్ అని తెలియడంతో షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

నాలుగేళ్ల ఫేస్‌బుక్ ప్రేమ.. ట్రాన్స్‌జెండర్ అని తెలియడంతో షాక్

July 24, 2022

సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలని ఎవరెన్ని చెబుతున్నా ఈ కాలం యూత్ మాత్రం వాటిని పట్టించుకునే స్థితిలో లేదు. ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించిన ఓ యువతి తన కుటుంబసభ్యులకు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారు ఆ ఫ్రెండ్ ఎవరో ఆరా తీశారు. ఆ తర్వాత నిజాలు తెలిసి షాక్ అయ్యారు. ఫేస్‌బుక్‌లో తనను తాను అబ్బాయిలా పరిచయం చేసుకొని సదరు యువతికి టోకరా వేశాడు ట్రాన్స్జెండర్. తనను సివిల్ ఇంజినీర్గా చెప్పుకొంటూ ఆమెను ప్రేమలోకి దించాడు. కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని విట్ల పట్టణంలో ఈ ఘటన జరిగింది. గత నాలుగేళ్లుగా నిందితుడు మహిళతో నిత్యం టచ్లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఫేస్బుక్లో మెసేజ్‌లు పంపించుకోవడం సహా ఫోన్లలో తరచుగా మాట్లాడుకునేవారని చెప్పారు. అయితే, ప్రేమ విషయం ఆ యువతి తన తల్లికి చెప్పడంతో నిందితుడి బాగోతం బట్టబయలైంది.

యువతి తల్లి తన కూతురు ప్రేమించిన వ్యక్తి ఫేస్బుక్ వివరాలు సేకరించి.. తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన అడ్వొకేట్ శైలజా రాజేశ్కు ఇచ్చారు. ఆ వివరాల ప్రకారం నిందితుడి ఆచూకీ తెలుసుకున్న శైలజా రాజేశ్.. పోలీసులకు సమాచారం అందించారు. ఉడుపి జిల్లాలోని ఓ ప్రాంతంలో నిందితుడిని పట్టుకున్నారు. అప్పుడే ఆ వ్యక్తి స్వలింగ సంపర్కుడని పోలీసులకు తెలిసింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మహిళను మోసం చేసినందుకు కేసు నమోదు చేశారు.