Bapatla beach tragedy in Andhra Pradesh suryalanka beach
mictv telugu

పండగపూట ఘోరం.. ముగ్గురి మృతి, ఇద్దరు…

October 4, 2022

దసరా సెలవులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. సరదాగా సముద్రంలో ఈతకు వెళ్లిన హైస్కూలు విద్యార్థులను మృత్యువు కబళించి ఇళ్లలో తీవ్ర విషాదం మిగిల్చింది. ముగ్గురు నీటమునిగి చనిపోగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఏపీలోని బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన విద్యార్థులు సెలవు రోజులు కావడంతో విహారయాత్రం కోసం తీరానికి వచ్చారు. ఈత సరిగ్గా రాకపోడంతో అలల తాకిడికి తట్టుకోలేక కొట్టుకుపోయారు. దగ్గర్లోని జాలర్లు, గజ ఈతగాళ్లు ఇద్దరిని కాపాడారు. కొట్టుకుపోయిన మరో ఇద్దరి కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. మృతులను విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన సిద్ధు, అభి, సాయి మధుగా, గల్లంతైన వారిని ఫణి, రాఘవ, ప్రభు దాసుగా గుర్తించారు. వీరు ఉదయం రైల్లో బాపట్లకు చేరుకుని, ఆటోలో వెళ్లారు. కొందరు ఇంట్లో చెప్పకుండా వచ్చినట్లు తెలుస్తోంది.