బిల్లు చెల్లించలేక.. కోలుకున్న ఆస్పత్రిలోనే ఉరేసుకున్న రోగి - MicTv.in - Telugu News
mictv telugu

బిల్లు చెల్లించలేక.. కోలుకున్న ఆస్పత్రిలోనే ఉరేసుకున్న రోగి

April 15, 2022

2

ఆస్పత్రి బిల్లు చెల్లించలేక అదే ఆస్పత్రిలో ఉరి వేసుకున్న వ్యక్తి ఘటన జయశంకర్ భూపాలపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెల్పూరులో కేటీపీపీ నిర్మాణంలో భాగంగా భూపాలపల్లి మండలం మహబూబ్ పల్లికి చెందిన మర్రిబాపు 2006లో తన రెండెకరాలు భూసేకరణలో కోల్పోయాడు. భూమి తీసుకున్నప్పుడు ఇంట్లో ఒకరికి ఉద్యోగమిస్తామని అప్పుట్లో హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకూ ఇవ్వలేదు. ఉద్యోగం కోసం బాపు కాళ్లరిగేలా తిరిగాడు. చివరిగా గతనెలలో కూడా అధికారులను కలిసి ఉద్యోగం కోసం అర్ధించాడు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నెల 1వ తేదీన కేటీపీపీ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడున్న సెక్యూరిటీ వాళ్లు స్పందించి భూపాలపల్లిలోని ప్రేవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల చికిత్స అనంనతరం బాపు కోలుకోగా, చికిత్సకు అయిన ఖర్చులు రూ.60 వేల బిల్లును ఆస్పత్రి సిబ్బంది కేటీపీపీ వారికి పంపారు. వారు ఆ బిల్లును చెల్లించమని కరాఖండీగా చెప్పేశారు. దీంతో బాపు కుటుంబ సభ్యులు డబ్బులకోసం ప్రయత్నించారు. ఇలా మూడు రోజులు గడచినా, డబ్బు తీసుకొని ఎవరూ రాకపోవడంతో విసుగు చెందిన బాపు ఆస్పత్రిలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు.