బార్ ఓపెనింగ్ కెళ్లిన మంత్రికి సీఎం క్లాస్..! - MicTv.in - Telugu News
mictv telugu

బార్ ఓపెనింగ్ కెళ్లిన మంత్రికి సీఎం క్లాస్..!

May 30, 2017


ఆయనేమో రాష్ట్రాన్ని మార్చేద్దామని ప్రయత్నిస్తున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ డిసిషన్స్ తో దేశం దృష్టిని ఆకర్షించారు. ఆయన కేబినెట్ లో ఓ మహిళ మంత్రికి మాత్రం అవేం పట్టినట్టు లేవ్. దర్జాగా ఓ బార్ ఓపెనింగ్ కు వెళ్లింది. సోషల్ మీడియాలో మంత్రి ఫోటోల్ని చూసిన సీఎం ఆమెకు క్లాస్ కు పీకారు..ఇంతకు ఎవరా మంత్రి.
ఈమె పేరు స్వాతి సింగ్. యూపీ బీజేపీ ప్ర‌భుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ‌శాఖ స‌హాయ మంత్రి. కానీ స్వ‌యంగా ఆమే వెళ్లి ఓ బార్‌ను ప్రారంభించ‌డం రచ్చ రచ్చ అయింది.గోమ్టిన‌గ‌ర్‌లో బి ద బీర్ అనే బార్‌ను స్వాతి సింగ్ మే 20న ఇద్ద‌రు ఐపీఎస్ అధికారుల‌తో క‌లిసి వెళ్లి ప్రారంభించారు.
అసలే అవకాశం కోసం ఎదురు చూస్తున్న విపక్షాలకు సాలిడ్ టాపిక్ దొరికింది. చెప్పేవి నీతులు.. చేసేవి మాత్రం ఇలాంటి ప‌నులా బీజేపీ సర్కార్ ని ఆటాడుకుంటున్నాయి.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బార్ ఓపెనింగ్ ఫోటోలు చూసిన యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ స‌ద‌రు మ‌హిళా మంత్రికి క్లాస్ తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించారు. బీజేపీ అధికార ప్ర‌తినిధి రాకేశ్ త్రిపాఠి మాత్రం మంత్రిని స‌మ‌ర్థించ‌డం విశేషం. రాష్ట్రంలో మ‌ద్యంపై నిషేధం లేదు కాబ‌ట్టి ఇందులో త‌ప్పేమీ లేద‌ని ఆమెను వెన‌కేసుకొచ్చారు. పైగా బార్ ఓనర్ మహిళ అని, మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికే వెళ్లానని మంత్రి స్వాతి సింగ్ అంటున్నారు. ఇంతకీ ఈమె ఎవరో తెలుసా గ‌తంలో బీఎస్పీ చీఫ్ మాయావ‌తిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసి పార్టీ నుంచి స‌స్పెండైన ద‌యాశంక‌ర్ సింగ్ భార్య‌.