బార్క్ కు చానల్స్ బైబై ..అర్నబ్ షాక్...! - MicTv.in - Telugu News
mictv telugu

బార్క్ కు చానల్స్ బైబై ..అర్నబ్ షాక్…!

May 19, 2017

బార్క్ రేటింగ్స్ వివాదస్పదమయ్యాయి. కొత్తగా లాంచ్ అయిన అర్నబ్ గోస్వామి రి పబ్లిక్ చానల్ కు 52 శాతం వ్యూయర్ షిప్ సాధించినట్టు బార్క్ రేటింగ్స్ ఇచ్చేయడం దుమారం రేపుతోంది. అసలే కొత్తగా లాంచ్ అయిన చానల్ వారంలోనే ఇంతా రేటింగ్స్ ఏంటీ అని అవాక్కయిన ఇంగ్లీష్ చానల్స్ బార్క్ పై విరుచుకుపడ్డాయి. ఎవరి ఒత్తిడితో ఇలా రేటింగ్ ఇచ్చారో చెప్పాలంటూ బార్క్ కు బై బై చెప్పేశాయి.
టెలివిజన్ రేటింగ్ సంస్థ ట్యామ్ కు పోటీగా బార్క్ వచ్చింది. తొలుత అన్ని చానల్స్ ట్యామ్ రేటింగ్స్ కే ప్రయారిటీ ఇచ్చాయి. రాను రాను ట్యామ్ రేటింగ్స్ లో మాల్ ప్రాక్టీస్ దందా పెరిగిదంటూ బార్క్ కు మారాయి. కొన్నాళ్లు బార్క్ బాగానే ఉన్నా..అర్నాబ్ గోస్వామి పెట్టిన కొత్త చానల్ రిపబ్లిక్ వచ్చాక బార్క్ బరి తెగించింది. జస్ట్ లాంచింగ్ చానల్ రిపబ్లిక్ కు ఫస్ట్ ప్లేస్ ఇచ్చేసింది. 52 శాతం వ్యూయర్ షిప్ సాధించినట్టు చూపింది. బార్క్ గజిబిజి లెక్కలతో షాక్ తిన్న ఇండియాటుడే. ఐబీఎన్ 18, టైమ్స్ నౌ లాంటి ఇంగ్లీష్ చానల్స్ బార్క్ కు గుడ్ బై చెప్పేశాయి.
నిజానికి కొత్తగా వచ్చిన అర్నాబ్ రిపబ్లిక్ టీవీ కి ఇప్పుడు రేటింగ్స్ ఇవ్వొద్దని నేషనల్ బ్రాండ్ కాస్టింగ్ అసోసియేషన్ ని ఇంగ్లీష్ న్యూస్ చానల్స్ కోరాయి. కానీ ఎన్ బీ ఏ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో రెచ్చిపోయిన బార్క్ రి పబ్లిక్ కు జై కొట్టి రూల్స్ తుంగలో .మిగతా ఇంగ్లీష్ చానల్స్ రేటింగ్స్ గంగలో కలిపేసింది. దీంతో బార్క్ పై ఫైర్ అయిన మిగతా ఇంగ్లీష్ ఛానల్స్ గుడ్ బై చెప్పేశాయి.