Bars for Ayyappa darshan even in heavy rain
mictv telugu

భారీ వర్షంలోనూ అయ్యప్ప దర్శనం కోసం బారులు

November 17, 2022

 

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేరళలోని  శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాలు ప్రారంభమయ్యాయి. మండలం-మకరవిలక్కు వార్షిక యాత్ర సీజనులో భాగంగా ప్రధాన అర్చకుడు ఎన్‌.పరమేశ్వరన్‌ నంబూద్రి ఆధ్వర్యంలో కోవెల ద్వారాలను బుధవారం సాయంత్రం 5 గంటలకు తెరిచారు.  కాగా ఆలయం తెరుచుకున్న మొదటి రోజే అయ్యప్ప భక్తులు ఆలయానికి వేల సంఖ్యలో పోటెత్తారు. కేవలం బుధవారం సాయంత్రం వరకే 30,000 మంది అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ కె ఆనంద గోపాల్ తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో ఈ సంఖ్య గణనీయంగా పేరుగుతుందని తెలిపారు. దీంతో పాటు మణికంఠుని దర్శనానికి వచ్చే వారు, చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు సూచించారు.

Sabarimala temple opens for pilgrimage season

కరోనా కారణంగా గత రెండేళ్లు రోజుకు 30 వేల మంది భక్తులనే అనుమతించారు. ఈ ఏడాది స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యపై ఎటువంటి పరిమితులు లేవని అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో ఈ సారి అయ్యప్ప మండల పూజ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆలయ యాజమాన్యం నిర్ణయించింది. అలాగే జ్యోతి దర్శనానికి లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని అంచనా వేసిన యాజమాన్యం ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నది.

Sabarimala temple opens for pilgrimage season