రేపట్నుంచి ఏపీలో బార్లు ఓపెన్  - MicTv.in - Telugu News
mictv telugu

రేపట్నుంచి ఏపీలో బార్లు ఓపెన్ 

September 18, 2020

Bars open in AP from tomorrow

ఏపీ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. రేపటి నుంచి బార్లు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. బార్ల లైసెన్సులు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 2021 జూన్‌ 30 వరకు 840 బార్ల లైసెన్సులను కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టంచేసింది. బార్ల లైసెన్సులపై 20 శాతం కొవిడ్‌ రుసుం విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 

2020-21 ఏడాదికి అబ్కారీ శాఖ ఈ రుసుంను వసూలు చేయనుందని తెలిపింది. అలాగే బార్ల మద్యం విక్రయాలపై అదనంగా 10 శాతం రిటైల్‌ ట్యాక్స్‌ను వసూలు చేయడంతో పాటు లైసెన్సు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను 10 శాతం మేర పెంచుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. విదేశీ మద్యం, దేశంలో తయారైన విదేశీ మద్యంపై 10 శాతం ఏఈఆర్టీ విధించనున్నట్టు తెలిపింది.