తెలంగాణ మందుబాబుల‌కు శుభవార్త.. తెరుచుకున్న బార్లు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ మందుబాబుల‌కు శుభవార్త.. తెరుచుకున్న బార్లు

September 25, 2020

Bars open in telangana from today.

తెలంగాణ‌లోని మందుబాబుల‌కు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. క‌రోనా వైరస్ వ్యాప్తి కార‌ణంగా మూత‌ప‌డిన బార్లు, క్ల‌బ్బుల‌ను తెరిచేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఈ మేరకు ఈరోజు ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో దాదాపు ఆరు నెలల తరువాత తెలంగాణలో బార్లు, క్లబ్బులు ఈరోజు నుంచి తెరచుకోనున్నాయి. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటిస్తూ బార్లను నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ మార్గదర్శలను బేఖాతర్ చేసే బార్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, వైన్సుల వ‌ద్ద ఉన్న ప‌ర్మిట్ రూంల‌పై మాత్రం నిషేధం కొన‌సాగుతుంద‌ని, తదుప‌రి ఉత్త‌ర్వులు వ‌చ్చే వ‌ర‌కు ప‌ర్మిట్ రూముల‌కు అనుమ‌తి లేద‌ని ఎక్సైజ్ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

 

ప్ర‌భుత్వం ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాలు..

* బార్లు, క్ల‌బ్స్ లోకి వచ్చే వారికి తప్పనిసరిగా థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ చేయాలి. శరీర ఉష్ణోగ్రత తక్కువ 

 ఉన్నవాళ్లను మాత్రమే లోనికి అనుమతించాలి.

 

* భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లు ఏర్పాటు చేయాలి. 

 

* బార్ సిబ్బంది త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాలి.

 

* బార్ల‌ను ఎప్పటికప్పడూ శానిటైజేషన్ చేయాలి.

 

* హ్యాండ్ శానిటైజ‌ర్లను అందుబాటులో ఉంచాలి.

 

* ఎక్కువ మంది గుమిగూడ‌టం, డ్సాన్సులు, డ్యాన్స్ ఫ్లోర్స్‌పై నిషేధం కొనసాగుతోంది.

 

* ప్ర‌తి క‌స్ట‌మ‌ర్ వ‌చ్చే ముందు సీట్స్ శానిటైజ్ చేయాలి.

 

* గాలి, వెలుతురు ఎక్కువ‌గా వ‌చ్చేట్లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.