Home > Featured > పరామర్శకు వెళ్లి గలీజ్ మాట.. డ్రాయర్లంటూ.. సీఎం సోదరుడి దూల

పరామర్శకు వెళ్లి గలీజ్ మాట.. డ్రాయర్లంటూ.. సీఎం సోదరుడి దూల

రాజకీయంగా, శాంతి భద్రతల పరంగా జార్ఖండ్ రాష్ట్రం ఇటీవల వార్తల్లో నిలిచింది. సొంత సంస్థకు గనులు కేటాయించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వం రద్దు కానుందని వదంతులు రాగా, అసెంబ్లీలో విశ్వాస తీర్మానం పెట్టి హేమంత్ తన బలాన్ని నిరూపించుకున్నారు. అయితే సీఎం ఎమ్మెల్యేలు సహా చత్తీస్ గఢ్‌లో క్యాంపు రాజకీయాల్లో మునిగితేలినప్పుడు రాష్ట్రంలో ఇద్దరు మైనర్ హిందూ బాలికల హత్యలు జరిగాయి. అంకిత అనే బాలికను నిందితుడు ఫారూఖ్ నిద్రిస్తున్నప్పుడు పెట్రోల్ పోసి నిప్పంటించగా, మరో గిరిజన బాలికను ఓ వ్యక్తి అత్యాచారం, హత్య చేసి చెట్టుకు వేలాడదీశాడు. ఈ రెండు సంఘటనలపై అక్కడ తీవ్ర దుమారం రేగగా, లవ్ జిహాద్ అంటూ హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

అయితే ఈ ఘటనలు జరిగిన దుమ్కా నియోజకవర్గానికి సీఎం హేమంత్ సోదరుడు బసంత్ సోరెన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన ఆయన బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో ఢిల్లీకి ఎందుకెళ్లారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆయన వెటకారంగా సమాధానమిచ్చారు. ‘నా లోదుస్తులు అయిపోయాయి. వాటిని కొనేందుకు ఢిల్లీ వెళ్లాను’ అంటూ ఎబ్బెట్టుగా బదులిచ్చారు. అలాగే రాష్ట్రంలో రాజకీయ అస్థిరత పరిస్థితులు ఉన్నాయని, శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. మొదటి మాటతో అక్కడి ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ బసంత్‌పై మండిపడింది. ‘లో దుస్తులు లేకపోవడం వల్ల ఢిల్లీ వెళ్లాల్సి రావడంతో బాధితులను ఆయన కలుసుకోలేకపోయారు’ అంటూ బీజేపీ నేత నిశింకాంత్ దూబే ఎద్దేవా చేశారు. కేంద్ర గిరిజన మంత్రి అర్జున్ ముండా బసంత్ వ్యాఖ్యలను తీవ్రంగా దుయ్యబట్టారు.

Updated : 8 Sep 2022 5:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top