బాసర సరస్వతీ అమ్మవారిపై రేంజర్ల రాజేష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసలు వ్యక్తమవుతోన్నాయి. బాసరలో గ్రామస్థుల బంద్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదువుల తల్లి సరస్వతిపై రేంజర్ల రాజేశ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గ్రామస్థులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచే స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు, దుకాణాలు,స్కూల్స్ మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. రోడ్లపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు రేంజర్ల రాజేశ్ దిష్టిబోమ్మను దగ్దం చేశారు.
సరస్వతీ అమ్మవారు చదువుల తల్లి కాదని.. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గిటార్ ఎలా పట్టుకుంటుందో.. అమ్మవారు వీణ అలా పట్టుకుంటుంది కాబట్టి..ఆవిడ మ్యూజిక్ టీచర్ అని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు. ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరలవ్వడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలయ అర్చకులతో పాటు పలువురు నిరసనకు దిగారు. బాసరలో బంద్ నిర్వహిస్తున్నారు. రాజేష్‌పై పిడి యాక్ట్ పెట్టాలని రాస్తారోకోకు దిగారు. కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాజేష్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. బాసర అమ్మవారి ఆలయ అర్చకులు రాజేష్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌కు సపోర్టుగా రేంజర్ల రాజేష్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీంతో అతడి ఇంటి ముందు హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. భైరి నరేష్‌ను సమర్థిస్తూ పోస్టులు పెట్టినందుకు రేంజర్ల రాజేష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భైరి నరేష్‌కు సపోర్ట్‌గా పోస్ట్ పెట్టినందుకు రేంజర్ల రాజేష్ క్షమాపణలు చెప్పారు. రేంజర్ల రాజేష్ గతంలో అయ్యప్పస్వామిని కించపరుస్తూ పాటలు పాడి యూట్యూబ్‌లో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.