బాసర ఆలయ చైర్మన్ సస్పెండ్.. కబ్జా కేసులో - MicTv.in - Telugu News
mictv telugu

బాసర ఆలయ చైర్మన్ సస్పెండ్.. కబ్జా కేసులో

November 22, 2019

Basara saraswati temple chairman sharat pathak suspended 

చదువుల తల్లి బాసర సరస్వతీ దేవస్థానం చైర్మన్ శరత్ పాఠక్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆలయ భూమిని కబ్జా చేసిన కేసులో ప్రభుత్వం చర్య తీసుకుంది. శరత్ అక్రమానికి పాల్పడ్డాడని నిర్ధాంచి పదవి నుంచి తప్పిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదిరోజుల కిందటే ఇవి జారీ అయినా తాజాగా వెలుగులోకి వచ్చాయి.  

నిర్మల్ జిల్లా బాసరలోని 447వ నంబరు సర్వే భూమిలో 8.11 ఎకరాలు గుడి పేరుతో ఉండగా,  శరత్ అక్కడ పంటలు పండిస్తున్నారు. అది సరికాదని ఆలయ ఎగ్జ్సిక్యూటివ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. వీటిని  ఆయన హైకోర్టులో సవాలు చేయగా, కోర్టు తాత్కాలిక ఊరట ఇచ్చింది. ఆలయ ఇన్‌ఛార్జ్ ఎగ్జ్సిక్యూటివ్ వినోద్ రెడ్డి ఈ కేసుపై ప్రత్యేక ఆసక్తి చూపారు. కబ్జా నిజమేనని నిర్ధారించి శరత్‌ను తప్పించారు. శరత్ వంశపారంపర్య సంప్రదాయం కింద గుడికి చైర్మన్ అయ్యారు. భూమిని తిరిగి అప్పగించాలని కోరినా పట్టించుకోలేదు. దీంతో ఆలయ కమిటీ విచారణ జరిపి నిబంధనల ప్రకారం పదవి నుంచి తొలగించింది.