బస్తా చిల్లర తీసుకెళ్లాడు.. ఏం కొన్నడంటే - MicTv.in - Telugu News
mictv telugu

బస్తా చిల్లర తీసుకెళ్లాడు.. ఏం కొన్నడంటే

February 18, 2022

money

ఓ దుకాణదారుడు బస్తా నిండా చిల్లర నాణేలు వేసుకొని వెళ్లి, షోరుంలో స్కూటర్ కొన్న సంఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అసోం రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఓ బస్తా నిండా చిల్లర నాణేలు వేసుకుని షోరూంకు వెళ్లాడు. అనంతరం తనకు నచ్చిన స్కూటర్‌ను ఎంచుకున్నాడు. ధర ఎంతో అడిగి ఆ స్కూటర్‌ను కొన్నాడు. విచిత్రం ఎంటంటే.. అతడు నోట్లు గాని, ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చెల్లిస్తాడని షోరూం సిబ్బంది అనుకున్నారు. కానీ, తీసుకొచ్చిన బస్తాను విప్పి నాణేలను ఇచ్చాడు. దీంతో ఆశ్చర్యానికి లోనైయిన షోరూం సిబ్బంది నాణేలను లెక్కపెట్టడంలో కాస్త శ్రమపడాల్సి వచ్చింది. ఈ సంఘటనను వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో తెగ వైరల్ అవుతుంది.