భయపడకండి.. గేదె కాదు గబ్బిలమే! - MicTv.in - Telugu News
mictv telugu

భయపడకండి.. గేదె కాదు గబ్బిలమే!

July 4, 2020

Buffalo

ప్రపంచంలోనే విచిత్రమైన జీవుల్లో ఒకటి గబ్బిలం. ఇవి చూడటానికి పక్షిలా కనిపించినా వాటికి పళ్లు, చెవులు ఉంటాయి. చీకట్లోనే అటూ ఇటూ ఎగురుతూ.. పగటిపూట చెట్లపై గడుపుతాయి. ఇవి పక్షుల వలే గుడ్లు పెట్టగలవు. అలాగే జంతువుల వలే పిల్లలను కనగలవు. ఇన్ని రకాల ప్రత్యేకతలు ఒక్క గబ్బిలాల్లోనే కనిపిస్తాయి. ఇటీవల కరోనా వ్యాప్తి సమయంలోనూ గబ్బిలాలపై రకరకాల పుకార్లు వచ్చాయి. అంతా వాటిని చూసి కొంత కాలం భయపడ్డారు. కానీ దాని ద్వారానే వైరస్ వచ్చిందని చెప్పడానికి సరైన ఆధారాలు ఏమి లభించలేదు. తాజాగా మరోసారి ఓ గబ్బిలం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసి జనం ఆసక్తిగా చర్చించుకోవడం ప్రారంభించారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే. 

సాధారణంగా గబ్బిలం చిన్నపాటి మొహంతో పెద్ద చెవులు రెక్కలను కలిగి ఉంటుంది. కానీ ఇటీవల ఓ గబ్బిలం మాత్రం భిన్నంగా  గేదె మొహాన్ని పోలి ఉంది. పెద్ద పెద్ద కళ్లు, ముక్కు, పొడవైన మొఖాన్ని కలిగి ఉంది.  వింత ఆకారంలో ఉన్న దీన్ని చూసి జనం వణికిపోయారు. ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆసక్తిగా మారింది.  చాలా మంది అది గబ్బిలమా..? లేక నిజంగానే గేదెనా అని  చర్చించుకుంటున్నారు. వెంటనే వీటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.

వాస్తవానికి  ఇవి కూడా ఒక రకం గబ్బిలాలు.  ఆఫ్రికా దేశాలైన ఐవరీ కోస్ట్, గినియా, గినియా బిస్సు, లైబీరియా, నైజీరియా, సెనెగల్ ప్రాంతాల్లో ఈ జాతి గబ్బిలాలు ఉంటాయి. ఇవి చూడటానికి  చిన్న సైజులో గేదె మొఖాన్ని తలపిస్తాయి. వీటిని  బ్యూటికోఫెర్స్ ఎపాలెట్టెడ్ ఫ్రూట్ బ్యాట్  అని పిలుస్తారు. సాధారణ గబ్బిలాల కంటే ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. మైదానాలు, అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని చూసిన జనం ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికీ తాము నమ్మలేకపోతున్నామని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ఈ గబ్బిలాలపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది.