Bathing in metro train..attacked when asked about this..video viral
mictv telugu

మెట్రో రైలులో స్నానం..ఇదేంటని ప్రశ్నించగా దాడి..వీడియో వైరల్

August 29, 2022

న్యూయార్క్ దేశంలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోను వీక్షిస్తున్న వారంతా ‘మెట్రో రైలులో స్నానం కూడా చేయవచ్చా?’ అంటూ ఆశ్చర్యానికి లోనౌతున్నారు. అయితే, ఆ వీడియోలో ఉన్నది ఎవరు? ఎందుకు అతడు మెట్రో రైలులో స్నానం చేశాడు? అనే వివరాల్లోకి వెళ్తే..

ఆ ఘటనకు సంబంధించిన వీడియోను.. @dailyinstavids అనే వినియోగదారు ట్విటర్‌లో, ఆగస్టు 25న పోస్ట్ చేశాడు. అందులో…”ఓ వ్యక్తి పసుపు బాత్ టబ్‌లో స్నానం చేస్తున్నాడు. ఆ తర్వాత అతను ఉద్దేశపూర్వకంగా ఒక ప్రయాణికుడిపై పడే విధంగా అతడు నీరు పోసుకున్నాడు. అప్పుడు ఆ ప్రయాణికుడి ఇదేంటని ప్రశ్నించగా, వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.” అయితే, ఈ వీడియోను ఇప్పటివరకు 36 లక్షల మంది వీక్షించారు. అందులో ఎవరిది తప్పు, అసలు మెట్రోలో స్నానం చేయడానికి అతడికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనే విషయాలపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.