Bathroom Se Aa Rahe Hain: Ticket Operator Leaves Funny Note at Patna Station,
mictv telugu

బాత్‌రూం నుంచి వస్తున్నా.. టికెట్ కౌంటర్ దగ్గర ఫన్నీ బోర్డు

September 2, 2022

మనలో చాలామందికి ఒక్కోసారి అర్జంట్‌గా బాత్రూమ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కువ సేపు ఆపుకోవ‌డం ఎవ‌రికైనా క‌ష్ట‌మే. టికెట్ కౌంట‌ర్‌లో కూర్చొని టికెట్ ఇస్తున్న ఆప‌రేట‌ర్‌కు సడెన్‌గా ప్ర‌కృతి నుంచి పిలుపొచ్చింది. అయితే, అత‌డు నిర్ల‌క్ష్యంగా లేచి వెళ్లిపోలేదు. బాధ్య‌తాయుతంగా ఓ బోర్డు పెట్టి వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

బీహార్ రాష్ట్రం పాట్నాలోని రైల్వే స్టేష‌న్‌లో టికెట్ ఆప‌రేట‌ర్‌కు అర్జెంట్‌గా బాత్రూమ్‌కి వెళ్లాల్సి వ‌చ్చింది. అయితే ప్యాసింజర్లు కంగారు పడకూడదనే ఉద్దేశంతో.. కౌంటర్ దగ్గర ఓ సూచన బోర్డు పెట్టి మరీ వెళ్లాడు. ఓ సూచ‌న బోర్డుపై “బాత్‌రూం నుంచి వస్తున్నా.. కాసేపు వేచి చూడండి.” అని హిందీలో రాశాడు. అయితే దీనిని చూసిన ప్యాసింజర్లు నవ్వుకున్నారు. ఈ బోర్డును ఓ వ్యక్తి ఏకంగా వీడియో తీశాడు. దానిని ట్విట్టర్‌లో పెట్టగా.. వైరల్ అవుతోంది.

ఈ ఫన్నీ నోట్‌ను చూసిన వారంతా నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పటి వరకూ లక్షా 28 వేల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీనిని 700 కంటే ఎక్కువ మంది షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అతని నిజాయితీని మెచ్చుకుంటే.. మరికొందరు బాధ్యతారాహిత్యం అంటున్నారు. ఒక నెటిజన్ “బిహారీ రాక్స్” అని వ్యాఖ్యానించారు. ఇంకొకరు “అత్యంత నిజాయితీ గల ప్రభుత్వ అధికారుల్లో ఒకరు” అని కామెంట్లు పెట్టారు.ఏదిఏమైనా ఆయన చేసిన పని నెట్టింట్లో తెగ నవ్విస్తుంది.