ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ..   - MicTv.in - Telugu News
mictv telugu

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ..  

September 18, 2020

 

bvc

తెలంగాణలో పూల పండుగ బతుకమ్మ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. అమావాస్య సందర్భంగా ఎంగిలిపూల వేడుకలను ప్రారంభించారు. తీరొక్క పూలతో అంగరంగ వైభవంగా బతుకమ్మలు పేర్చి వాడ వాడల ఆడపడుచులు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. రాష్ట్రవ్యాప్తంగా సంప్రదాయ పద్దతిలో గౌరమ్మను అలంకరించారు ఆ తర్వాత చెరువుల్లో నిమజ్జనం చేశారు. కాగా గతానికి భిన్నంగా ఈ ఏడాది నెల రోజులు ముందుగానే ఎంగిపూల బతుకమ్మను పేర్చి వేడుకలను ప్రారంభించారు. 

దసరా పండగకు తొమ్మిది రోజుల ముందుగా ఈ వేడుకలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఈ ఏడాది అధికమాసం రావడంతో గురువారం పితృ అమావాస్య సందర్భంగా ఎంగిలి పూల బతుకమ్మ నిర్వహించారు. యథావిధంగా వచ్చే నెల 17 నుండి మళ్లీ వేడుకలు ప్రారంభం కానున్నాయి. రాష్ట వ్యాప్తంగా అక్టోబర్ 22 తేదీన సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు.