Bathukamma festival song 2022 by vani ollala Lakshmi
mictv telugu

మైక్ టీవీ బతుకమ్మ పాట 2022 వచ్చేసింది..

September 24, 2022

బతుకమ్మ పండగకు అటు ప్రకృతి, ఇటు తెలుగు ప్రజలు సంబరాలు, సరుకులతో సిద్దమయ్యాయి. పండగ పాటలకు పెట్టింది పేరైన మైక్ టీవీ అందమైన రాగాలతో వచ్చేసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అద్భుతమైన వీడియాలు రూపొందిస్తూ కోట్లాది ప్రేక్షకుల అభిమానం చూరగొంటున్న మైక్ టీవీ ఈ ఏడాది కూడా అందమైన బతుకమ్మ పాటతో మీ ముందుకొచ్చింది. పూల పండగ సారాంశాన్ని, దాని చుట్టూ అల్లుకున్న మమతలను, అనురాగాలను కళ్లకు కట్టే వీడియో సాంగ్ ఆకట్టుకునే సంగీత సాహిత్యాలతో సాగుతుంది.

‘‘కొమ్మకొమ్మ రెమ్మరెమ్మ పూలు పూసెనే
నేలంత నిండుపూల జాతరాయెనే
వాకిలలికే చేతులన్ని పూలు పేర్చెనే..
అమ్మలక్కలంత బతుకమ్మలాడెనే
పల్లె మట్టిగొంతులన్నీ పాట పాడెనే
గాజుల చప్పట్లు గల్లుగల్లున మోగెనే
లాయి.. లాయి.. లాయి.. లాయి.. లాయిరే
కోలు.. కోలు.. కోయిలాలో.. కొమ్మాలాయిరే..’’
అంటూ బతుకమ్మ పండగ విశేషాలను అందమైన పదాలతో పరిచయం చేసే ఈ పాటను, వాణి ఒల్లాల, లక్ష్మి, మల్లీశ్వరి ఆలపించగా అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించారు. గసిగంటి రామలింగం, యశ్‌పాల్ సాహిత్యం, ఎస్ కే బాబ్జి సంగీతం అందించగా, తిరుపతి గౌని దర్శకత్వం వహించారు.