మైక్ టీవీ బతుకమ్మ పాట 2021 వచ్చేసింది.. రిగలే రిగరిగలే - MicTv.in - Telugu News
mictv telugu

మైక్ టీవీ బతుకమ్మ పాట 2021 వచ్చేసింది.. రిగలే రిగరిగలే

October 8, 2021

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అద్భుతమైన వీడియాలు రూపొందిస్తూ కోట్లాది ప్రేక్షకుల అభిమానం చూరగొంటున్న మైకట్ టీవీ ఈ ఏడాది కూడా అందమైన బతుకమ్మ పాటతో మీ ముందుకొచ్చింది. పూల పండగ సారాంశాన్ని, దాని చుట్టూ అల్లుకున్న మమతలను, అనురాగాలను కళ్లకు కట్టే వీడియో సాంగ్ ఆకట్టుకునే సంగీత సాహిత్యాలతో సాగుతుంది.

‘‘రిగలే రిగరిగలే వెలుగుల వెన్నెలా
జిగలే జిగజిగలే పువ్వుల కన్నులా
పువ్వుల జాతరే సింగిడి రంగులా
వరాలు పూసినా పువ్వుల సక్కదనం..
కొమ్మరెమ్మా పూతా మొగ్గా పువ్వయి పూయంగా
బతుకమ్మ తల్లికి పువ్వుల చీరల సారెలు పెట్టంగా
అక్కాచెల్లెలు పుంగిడిపూతల ఆటలు ఆడంగా..అంటూ బతుకమ్మ పండగ విశేషాలను అందమైన పదాలతో పరిచయం చేసే ఈ పాటను కనకవ్వ, వాణి ఒల్లాల, శ్రుతి ఆలపించగా అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించారు. రవిచంద్రన్ సాహిత్యం అందించగా ‘బుల్లెట్టు బండి’ పాట ఫేమ్ ఎస్.కే. బాజీ సంగీతం సమకూర్చారు. తిరుపతి దర్శకత్వం వహించారు.