బతుకమ్మ చీరలు ఇవే.. 9 నుంచి పంపిణీ  - MicTv.in - Telugu News
mictv telugu

బతుకమ్మ చీరలు ఇవే.. 9 నుంచి పంపిణీ 

September 29, 2020

Bathukamma free sarees ready .

తెలంగాణ బతుకు పూల పండగకు సన్నాహాలు సాగుతున్నాయి. ఆడపడచులకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను సిద్ధం చేసింది. ఈ రోజు బేగంపేట హ‌రిత ప్లాజాలో జౌలి శాఖ వాటిని ప్రదర్శించింది. మంత్రులు కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డి, స‌త్య‌వ‌తి రాథోడ్ వాటిని పరిశీలించారు. పండగ కోసం పేద ఆడబిడ్డలకు ప్రభుత్వం వాటిని చిర కానుకగా అందిస్తోందని కేటీఆర్ అన్నారు. చేనేత కార్మికులను ఆదుకోడానికి పని కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రతి ఏడాదీ కోటి చీరలను నేయిస్తున్నామని చెప్పారు. రంజాన్, క్రిస్మస్ పండగలకు కూడా ఉచితంగా చీరలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. 

జౌళి శాఖ వచ్చే నెల.. అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుంది. కోటికిపైగా చీరలను అర్హులకు ఇళ్లకు వెళ్లి మరీ ఇస్తుంది. కరోనా వైరస్ నేపథ్యంలో క్యూల ద్వారా పంపిణీ కష్టం కనుక ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి బతుకమ్మ చీరలను మొత్త 287 డిజైన్ల‌తో రూపొందించారు. దీని కోసం రూ. 317.81 కోట్లు ఖర్చు చేశారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల యూనిఫారాలను కూడా చేనేత కార్మికులతో తయారు చేయిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.