మైక్ టీవీ బతుకమ్మ పాట 2020 వచ్చేసింది (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

మైక్ టీవీ బతుకమ్మ పాట 2020 వచ్చేసింది (వీడియో)

October 11, 2020

vnmvhm

తెలంగాణ సంస్కృతిలో గొప్ప రిథమ్ ఉన్న పండగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ మకుటం అని కూడా చెప్పవచ్చు. ఆడపడుచుల మోములో ఆనందాలను వెల్లువిరిసే పూల పండుగ ఇది. ఈ పండుగకు మరింత శోభను తెస్తూ ప్రతిఏడు బతుకమ్మ పాటలు వస్తున్నాయి. ఎందరో కొత్త కొత్త పాటలు చేస్తున్నారు. తమ పాటలతో బతుకమ్మలకు పబ్బతి పడుతున్నారు. మైక్ టీవీ కూడా ప్రతి ఏడాది బతుకమ్మకు పాటతో పబ్బతి పడుతున్న విషయం తెలిసిందే. మైక్ టీవీ పాట అంటేనే ప్రత్యేకం అని ప్రేక్షకులు అనడం మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ ఉత్సాహంతోనే బతుకమ్మ పాటలను రూపొందిస్తున్నాం. 

ఈసారి కూడా మీరెంతగానో ఎదురుచూస్తున్న బతుకమ్మ పాటతో మీ ముందుకు వచ్చాం. పాటల పుట్ట, మట్టి మనిషి కనకవ్వ, లక్ష్మీ పాడిన పూర్తి పాట వచ్చేసింది. ‘కొంగుల్లు సుట్టుర్రె కోమలాంగి.. గుడుగొమ్మలు వంచుర్రె సుందరాంగి’ అంటూ సాగే పాట మిమ్మల్ని మంచి అనుభూతికి గురిచేయడం ఖాయం. క్రింది లింకులో పూర్తి పాటను చూడగలరు.