Batsmen who did not hit a single six in their career
mictv telugu

కెరీర్‌లో ఒక్క సిక్స్ కొట్టని బ్యాట్స్‌మెన్‌లు వీరే..

November 24, 2022

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎందరో హిట్టర్స్‌ను చూసి ఉంటారు. అలాగే ఎంతో మంది డిపెండ్‌బుల్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. కొందరు సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడితే మరికొందరు సింగిల్స్, డబుల్స్ తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ..కుదిరినప్పుడు బౌండరీలను బాదుతారు. అయితే సుదీర్ఘంగా క్రికెట్ ఆడి వన్డేలో ఒక్క సిక్స్ కొట్టని ఆటగాళ్ళు ఉన్నారంటే నమ్ముతారా ? నమ్మడం కొంచెం కష్టమైనా తప్పదు నమ్మాల్సిందే. వారి కెరీర్‌లో సెంచరీలు, ఆఫ్ సెంచరీలు చేసిన ఒక్క సిక్స్ మాత్రం కొట్టలేక పోయారు. ఇండియా తరఫున కూడా సిక్స్ కొట్టని బ్యాట్స్ మెన్ ఉండటం విశేషం.

*భారత్‌కు ఆల్‌రౌండర్ మనోజ్ ప్రభాకర్ 12 ఏళ్ల కెరీర్‌లో ఒక్క బాల్‌ను కూడా స్టేడియంలోకి పంపించ లేకపోయాడు. దేశం తరఫున 130 వన్డేలు ఆడిన మనోజ్ ప్రభాకర్ రెండు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు చేశాడు. కానీ తన వన్డే కెరీర్‌లో ఒక్కసారి కూడా సిక్సర్ కొట్టలేకపోయాడు.

*జింబాబ్వేకు చెందిన డియోన్ ఇబ్రహీం సుదీర్ఘంగా తమ దేశానికి సేవలందించాడు. ఈ ఆటగాడు 82 వన్డేలు, 29 టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడాడు. వన్డే క్రికెట్‌లో అతను ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు సాధించగా.. టెస్టుల్లో పది అర్ధ సెంచరీలు ఉన్నాయి. కానీ ఒక్కసారి కూడా సిక్స్‌ను బాదలేకపోయాడు. వన్డేల్లోనే కాదు టెస్టు మ్యాచ్‌ల్లో కూడా స్డేడియంలోకి బంతిని పంపించలేకపోయాడు. సెంచరీ, 14 హాఫ్ సెంచరీలు సాధించిన డియోన్ ఇబ్రహీం సిక్సర్ కొట్టలేకపోవడం చాలా ఆశ్చర్యకర విషయమే.

*థిలాన్ సమరవీర..శ్రీలంక తరపున నిలకడగా పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడు. ODI కెరీర్‌లో మాత్రం 53 మ్యాచ్‌లు ఆడినా బంతిని బౌండరీ లైన్ దాటించలేకపోయాడు. వన్డేలో రెండు సెంచరీలు సాధించాడు. కానీ, ఒక్కసారి కూడా సిక్స్ కొట్టలేకపోయాడు.

నిజానికి గతంలో ఫోర్లతో పోలిస్తే ఎక్కువ సిక్సర్లు కొట్టే హిట్టర్లు మాత్రం తక్కువగా ఉండేవారు. టీమ్‌లో కొంతమంది ఆటగాళ్లకి మాత్రమే అది సాధ్యమయ్యేది.
కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీ-20 క్రికెట్‌ వచ్చాక బౌండరీలు, సిక్సర్లు చాలా ఈజీగా బాదేస్తున్నారు. ఇక ఒకే వన్డేలో అత్యధిక సిక్సర్లు సాధించిన బ్యాట్స్ మెన్‌గా ఇయాన్ మోర్గాన్ ((17 సిక్సర్లు) రికార్డుల్లో ఉన్నాడు.