నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలు ఎంత ఉత్కంఠభరింతగా, ఆసక్తికరంగా సాగుతున్నాయో మనకు తెలుసు. చంద్రబాబు పాలనకు రిఫరెండమ్ అని, జగన్ ప్రతిష్టకు సవాల్ అని ఈ ఎన్నికల గురించి చెబుతున్నారు. అయితే ప్రస్తుతం దీనికంటే ఉత్కంఠభరితంగా సాగుతోంది ఢిల్లీలోని బావానా అసెంబ్లీ ఉప ఎన్నిక. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాలనకు ఈ ఎన్నికలు రిఫరెండమ్ అని చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఉప ఎన్నికల గురించి తెలుసుకుంటున్నారంటే సీన్ ఏమిటో అర్థమవుతుంది.
ఆప్ ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ ఈ ఏడాది మార్చిలో బీజేపీలోకి జంప్ కావడంతో బవానాకు ఉప ఎన్నిక అవసరమైంది. ఉప ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున బరిలోకి దిగారు. ఆప్ తరఫున రాంచంద్ర పోటీలో ఉన్నారు.
2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్ చేసిన ఆప్ తర్వాత తను ఉనికిలో ఉన్న రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో చతికిలబడిపోయింది. బీజేపీ వరుస విజయాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో బావానా ఎన్నికల్లోనైనా గెలవడానికి ఆప్ నేతలు భారీగా ప్రచారం చేశారు.