అమితాబ్, రుషికపూర్‌లను చంపేసిన బీబీసీ! - MicTv.in - Telugu News
mictv telugu

అమితాబ్, రుషికపూర్‌లను చంపేసిన బీబీసీ!

December 5, 2017

వార్తల్లో అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు రావడం, వారిని సవరించుకుంటుడడం తెలిసిందే. అయితే ప్రముఖు మరణాల విషయంలో పొరపాట్లు జరిగితే నవ్వుల పాలవడం ఖాయం. ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ బాలీవుడ్ నటుడు శశికపూర్ మృతి విషయంలో ఇలాంటి పొరపాటే చేసింది. శశికపూర్ మరణవార్తను ప్రస్తారం చేస్తూ.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రుషి కపూర్‌ల వీడియో క్లిప్‌ను ప్రసారం చేసింది. అది అలా ప్లే అవుతూనే ఉన్నా పట్టించుకోలేదు.

దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు, చురకలు వెల్లువెత్తడంతో తర్వాత తప్పు దిద్దుకుంది. బీబీసీ-ఎడిటర్‌ పౌల్‌ రోయల్‌ దీనిపై స్పందించారు. తాము ఘోర తప్పిదం చేశామని, తమను క్షమించాలని కోరారు. ‘శశికపూర్‌ మృతి సందర్భంగా షేర్‌ చేసిన వీడియోలో తప్పుడు చిత్రాలను చూపించినందుకు వెర్రీ సారీ’ అని ఆయన ట్వీట్‌ చేశారు. బీబీసీలో సాధారణంగా ఇలాంటి తప్పులు జరుగవని , పొరపాటున జరిగినందుకు మనసారా క్షమాపణ చెబుతున్నా అని పేర్కొన్నారు.