BC leader r krishnayya cimments on rajyasabha seat
mictv telugu

టీడీపీ నన్ను వాడుకుంది.. నేను వేరే పార్టీలను వాడుకుంటున్నా

May 23, 2022

BC leader r krishnayya cimments on rajyasabha seat

బీసీల గొంతుకగా ఏపీ వైసీపీ పార్టీ తరపున రాజ్యసభ సీటు దక్కించుకున్న ఆర్. కృష్ణయ్య సోమవారం తనపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చారు. ఓ మీడియాతో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘రాజకీయాల కోసం బీసీలను కొన్ని పార్టీలు వాడుకున్నాయి. బీసీలు ఎదగాలని పోరాటం చేసే నేను పదవుల కోసం అమ్ముడుపోతానని విమర్శిస్తున్నారు. దివంగత ఎన్టీఆర్ హయాంలోనే నాకు మంత్రి పదవి ఇవ్వజూపితే తిరస్కరించా. కేసీఆర్, జగన్‌లు నన్ను గుర్తించారు. కానీ, వైఎస్ జగన్ మొదట అవకాశమిచ్చారు. బీసీల సమస్యలపై రాజ్యసభలో గళం విప్పుతా.

నాకు పదవి ఇచ్చి జగన్ ఇబ్బంది పడుతున్నాడని ఆరోపిస్తున్నారు. నాకు పదవి ఇవ్వడం సరైంది కాకపోతే నేను గుండు గీయించుకుంటా. 1976 నుంచి ఉద్యమంలో ఉన్నా. 2014లో టీడీపీ నన్ను వాడుకొని గెలిచింది. నేను కూడా కొన్ని సార్లు రాజకీయ పార్టీలను వాడుకున్నా. నేను పార్టీలు మారలేదు. పార్టీలనే ఉద్యమాల వైపు చూసేలా చేశా. గతంలో దమ్మున్న నేతలు కూడా బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. వైసీపీ మాత్రం అన్ని రంగాల్లో సముచిత స్థానం ఇచ్చింది’ అని అభిప్రాయపడ్డారు.